పట్టువదలని విక్రమార్కుడు… గ్రూప్-3 లో విజయ్ ఘనత:

రాయికల్ డిసెంబర్20 (జనం సాక్షి):భూపతిపూర్ గ్రామానికి చెందిన బొడ్డుపెల్లి విజయ్ గ్రూప్–3 పరీక్షలో ఉత్తీర్ణత సాధించి సీనియర్ అకౌంటెంట్ (ఫైనాన్స్) గా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతంలో గ్రూప్–1లో కేవలం 1 మార్కు తేడాతో, గ్రూప్–2లో 2 మార్కుల తేడాతో అవకాశం చేజారినప్పటికీ నిరుత్సాహపడకుండా పట్టుదలతో కృషి చేసి ఈ విజయం సాధించారు. ప్రస్తుతం రాయికల్ మండలం వస్తాపూర్ గ్రామ సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న విజయ్ ను గ్రామ ప్రజలు, అభినందించారు.



