వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును వెనక్కి తీసుకోవాలి: ఎమ్మెల్యే జీఎస్సార్
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం వక్ఫ్ బోర్డు చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ముస్లీం మతస్తులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై మాట్లాడారు. ముస్లీం పూర్వీకులు దానం చేసిన ఆస్తులతో సహా, వక్ఫ్ ఆస్తులను అక్రమంగా స్వాధీనం చేసుకుని, వాటిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు.