విద్యుత్ షాక్ తో మహిళ మృతి

 

 

 

 

 

 

 

 

 

చెన్నారావుపేట, డిసెంబర్ 26 (జనం సాక్షి):

లింగాపురంలో చోటుచేసుకున్న సంఘటన….

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని లింగాపురం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం… ఇదే గ్రామానికి చెందిన పల్లాటి సబిత (35) అనే మహిళ తన ఇంటి ఆవరణలో ఉన్న విద్యుత్ మోటార్ నడవకపోవడంతో నీటి లెవెల్ ను పోస్తుంది. ప్రమాదవశాత్తు విద్యుత్ మోటార్ కు ఉన్న తీగ ద్వారా విద్యుత్ ప్రసారం కావడంతో విద్యుత్ షాక్ కు గురైంది. వెంటనే కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త లింగమూర్తి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. విద్యుత్ షాక్ తో తల్లి మృతి చెందడంతో ఇద్దరు కుమార్తెలు తల్లి మృతదేహం పై పడి రోధిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించింది.