నాడు ఎంపీటీసీ… నేడు సర్పంచ్.

ఎస్సీ మహిళకు కలిసి వచ్చిన ఉప్పరపల్లి గ్రామం…
చెన్నారావుపేట, డిసెంబర్ 20 (జనం సాక్షి)నాడు ఎంపీటీసీగా గెలుపొందింది. నేడు మళ్లీ సర్పంచ్ గా విజయం సాధించింది. మండలంలోని ఉప్పరపల్లి గ్రామంలో 2014లో ఎంపిటిసి స్థానం ఎస్సీ మహిళకు రిజర్వేషన్ కావడంతో కాంగ్రెస్ పార్టీ నుండి అదే గ్రామానికి చెందిన చిలపాక అనిత బరిలోకి దిగి ఎంపిటిసిగా గెలుపొందింది. మళ్లీ ఈ ఏడాది డిసెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలలో ఎస్సీ మహిళకు సర్పంచ్ స్థానం రిజర్వేషన్ ఖరారైంది. బిఆర్ఎస్ పార్టీ నుండి చిలపాక అనిత బరిలో నిలిచి సర్పంచ్ గా విజయం సాధించింది. దీంతో ఉప్పరపల్లి గ్రామం ఆమెకు కలిసి వచ్చినట్లయింది. నాడు ఎంపిటిసిగా నేడు సర్పంచ్ గా అవకాశం రావడం చాలా ఆనందంగా ఉందని చిలపాక అనిత తెలిపింది.



