ఉమ్మడి జిల్లాలో ఉధృతంగా ఆర్టీసీ సమ్మె

share on facebook

నల్లగొండలో కెసిఆర్‌ ఆదిష్టిబొమ్మ దహనం

నల్లగొండ,అక్టోబర్‌9 (జనం సాక్షి):  ఉమ్మడి జిల్లాలో ఆర్టీసీ సమ్మె ఉదృథంగా సాగుతోంది. కార్మికులు డిపోల ముందు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం తక్షణం తమ సమస్యలు పరిష్కరించాలని డియమాండ్‌ చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికుల సమ్మెలో భాగంగా ఆందోళనకు దిగారు. ఆయా డిపోల ముందు నిరసనలు వ్యక్తం చేశారు. నల్లగొండలో సిఎం కెసిఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన కార్మికులు కెసిఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్టీసీని కాపాడాలని పిలుపునిచ్చారు. కిసిఆర్‌ నిరంకుశ వైఖరినై పోరాడాలన్నారు. సమ్మె కారణంగా హైదరాబాద్‌,వరంగల్‌, నల్లగొండకు వెళ్లే మార్గంలో మాత్రమే ఉదయం బస్సులు నడిచాయి. మోత్కూర్‌, గజ్వెల్‌ రోడ్డు మార్గంలో అలస్యంగా బస్సులు రావడంతో పాటు తక్కువ సంఖ్యలో బస్సులు ఉండడంతో బతుకమ్మ, దసరా పండుగకు వెళ్లే ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను అశ్రయించారు. ఈ మార్గంలో అదనంగా రూ.10 నుంచి రూ. 20 వరకు చార్జీలను వసూళ్లు చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రయాణికులతో మాట్లాడి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నమని పోలీసులు చెప్పారు. కంట్రోల్‌ ఉండే స్థానంలో పోలీసులు ఉంటూ బస్సుల రాకపోకల వివరాలను నమోదు చేసుకున్నారు. మొత్తం విూద నిత్యం రద్దీగా ఉండే బస్టాండ్‌లలో సమ్మె సందర్భంగా అంతగా ప్రయాణికులు కనిపించలేదు. . కిరాయి వసూలు విషయంలో ప్రైవేట్‌ వాహనదారులు దోపిడీకి పాల్పడుతున్నారు. రాష్ట్రంలో రైతుల నుంచి మొదలుకుని అందర్ని మోసం చేసిన కేసీఆర్‌కు గతంలో చంద్రబాబుకు పట్టిన గతే పడుతుందని కార్మికులు అన్నారు. ఒక్క ఉద్యోగిని తొలగించనా రాష్ట్రం అగ్నిగుండం కావటం ఖాయమని అన్నారు. లారీడ్రైవర్లును తీసుకొచ్చి ఎలాంటి టికెట్లు లేకుండా బస్సులను నడపిస్తూ సీఎం దోపిడిదారితనానికి ఆజ్యం పోస్తున్న నియంత సీఎం కేసీఆర్‌ అని విమర్శించారు.

Other News

Comments are closed.