నేడు కార్గిల్‌ అమరవీరుల దినోత్సవం

share on facebook

సంగారెడ్డి,జూలై25(జ‌నంసాక్షి):ఈనెల 26వ తేదీన కార్గిల్‌ విజయ్‌ దివస్‌ను నిర్వహిస్తున్నట్లు మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్‌.దశరథ్‌, జి.పోచయ్య  ఒక ప్రటనలో తెలిపారు. దేశ రక్షణ కోసం సైనికులు కార్గిల్‌లో పోరాడి విజయం సాధించారని కొనియాడారు. దేశం కోసం పోరాడి అశువులు బాసిన వీరజవానుల సేవలను స్మరించుకుంటూ వారికి నివాళులర్పించాలన్నారు. ఈ నెల 26వ తేదీన నిర్వహించే కార్గిల్‌ విజయ్‌ దివస్‌కు ముఖ్యఅతిథులుగా కలెక్టర్‌ హనుమంతరావు, ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ మంజుశ్రీ, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి, అందోల్‌ ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌, సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌, డీఈవో విజయలక్ష్మి పాల్గొంటారని తెలిపారు. కార్గిల్‌ డేకు జిల్లాలోని మాజీ సైనికుల కుటుంబ సభ్యులు, సైనికులు పెద్దసంఖ్యలో పాల్గొనాలని కోరారు.

Other News

Comments are closed.