బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న MLA మెచ్చా

share on facebook

వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఘనంగా బతుకమ్మ సంబరాలు
30 సెప్టెంబర్ (జనం సాక్షి): దమ్మపేట మండల కేంద్రంలో స్ధానిక నాయకులతో కలిసి అర్బన్ కాలనీ,మోడల్ కాలనీ,కొత్తపేట , సాయి బాబా గుడి వీధి లో,మరియు బంజారా కాలనీలో బతుకమ్మ సంబరాల్లో పాల్గొనీ ఆడపడుచులు మరియు చిన్నారులతో కలిసి నృత్యం చేశారు అశ్వారావుపేట *MLA మెచ్చా నాగేశ్వరరావు *
(ఈ సందర్భంగా MLA కి ఘన స్వాగతం పలికారు అలాగే ఘనంగా కమిటీ సభ్యులు MLA నీ శాలువా కప్పి సత్కరించారు)

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పడక ముందు మనం పండుగను జరుపుకున్నాం కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ రోజు నుంచి దేశం సైతం మనవైపు చూసి అబ్బురపడేలా పండుగను జరుపుకుంటున్నాం అని అలాగే ప్రతి ఒకరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సంతోషంగా పండుగను జరుపుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో దొడ్డకుల రాజేశ్వరరావు, దమ్మపేట వైస్ సర్పంచ్ దారా యుగంధర్, వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు, యార్లగడ్డ బాబు. తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.