మోడీ ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాని

share on facebook

– మండిపడ్డ కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌
న్యూఢిల్లీ,డిసెంబర్‌ 26(జనంసాక్షి): దేశంలో ఎక్కడా డిటెన్షన్‌ సెంటర్లు లేవని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ తప్పుపట్టారు. మోదీని ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రధాని అంటూ పోల్చిన రాహుల్‌.. ఆయన భారత మాతకు అబద్దాలు చెప్తున్నారని విమర్శించారు. డిటెన్షన్‌ సెంటర్లపై మోదీ చేసిన కామెంట్ల వీడియోలో ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అదే వీడియోలో అస్సాంలో ఉన్న డిటెన్షన్‌ సెంటర్‌ను చూపించారు.ప్రధాని ఈ అంశంపై అబద్దాలు చెప్తున్నట్లు తన ట్వీట్‌కు జూట్‌ జూట్‌ జూట్‌ అన్న హ్యాష్‌ ట్యాగ్‌ ఇచ్చారు. ముస్లింలను డిటెన్షన్‌ సెంటర్లకు పంపిస్తున్నట్లు.. కాంగ్రెస్‌ పార్టీ, కొందరు అర్బన్‌ నక్సల్స్‌ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ప్రధాని మోదీ ఇటీవల అన్నారు. కానీ, ప్రధాని అన్నీ అబద్దాలు చెప్తున్నారని రాహుల్‌ తన వీడియోలో ఆరోపించారు.

Other News

Comments are closed.