విూడియా సంస్థలకు ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం

share on facebook

– రూ. 10లక్షల జరిమానా
న్యూఢిల్లీ, ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌లోని కథువాలో అత్యంత దారుణంగా అత్యాచారానికి, హత్యకు గురైన ఎనిమిదేళ్ల బాలిక పేరు, ఫొటో, ఇతర వివరాలను పలు విూడియా సంస్థలు బయటపెట్టడంపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సదరు  విూడియా సంస్థలపై రూ.10 లక్షల జరిమానా విధించింది. ఆ మొత్తాన్ని బాధితురాలి పరిహార నిధికి పంపించాలని కోర్టు ఆదేశించింది. చట్ట ప్రకారం విూడియా సంస్థలు అత్యాచార బాధితురాలి పేరును వెల్లడించకూడదు. అయితే ఇటీవల జరిగిన కథువా ఘటనలో బాధితురాలైన మైనర్‌ బాలిక పేరు, ఫొటో వివరాలు పలు పత్రికలు, ఛానళ్లు ప్రముఖంగా వెల్లడించాయి. దీన్ని కోర్టు తీవ్రంగా ఖండించింది.  అత్యాచార బాధితురాలి వివరాలు బయటపెడితే వారికి ఆర్నెల్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశముందని కోర్టు తెలిపింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 25కు వాయిదా వేసంది.
నవరిలో కథువాలోని రసానా గ్రామంలో ఎనిమిదేళ్ల బాలికను దాదాపు వారం రోజుల పాటు బంధించి, మత్తు పదార్థాలిచ్చి, అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే. అనంతరం ఆమెను హత్య చేసి సవిూపంలోని అటవీ ప్రాంతంలో పడేశారు. ఈ ఘటనలో పోలీసులు ఎనిమిది మందిని నిందితులుగా అరెస్ట్‌ చేశారు. కేసు విచారణ జరుగుతోంది.

Other News

Comments are closed.