సహకార రంగం బలోపేతంతోనే అభివృద్ది

share on facebook

ఆర్థిక వ్యవస్థ పునాదుల్లో ఈ రంగానికీ కీలక భూమిక
మెగా సహకార సంఘాల ప్రతినిధుల సభలో అమిత్‌ షా
న్యూఢల్లీి,సెప్టెంబర్‌25  (జనంసాక్షి); సహకార సంఘాలు దేశ అభివృద్దిలో ముఖ్యమైన సహకారం అందించగలవని అమిత్‌ షా అన్నారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి సహకార రంగం కూడా కృషి చేస్తుందని ప్రధాని మోదీకి హావిూ ఇస్తున్నట్టుగా చెప్పారు. ఢల్లీిలోని ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగిన ఈ మెగా సదస్సులో 2,000కు పైగా సహకార సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అంతేకాకుండా వర్చువల్‌ విధానంలో ఇండియా నుంచి విదేశాల నుంచి ఈ సదస్సులో పాల్గొన్నారు.కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన సహకార శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన హోంమంత్రి అమిత్‌ షా.. సహకారం సంస్థల మెగా సదస్సులోపాల్గొన్నారు. ఈ సందర్భంగా సహకార రంగంలో ప్రభుత్వ ప్రణాళికలు, అభివృద్దికి కేంద్రం తీసుకున్న చర్యలను అమిత్‌ షా వివరించారు. ఈ సందర్భంగా అమిత్‌ షా మాట్లాడుతూ.. ’దేశంలో అగశ్రేణి నాయకులు పండిరట్‌ దీన్‌ దయాళ్‌ జయంతి రోజున ఈ సహకార సదస్సు జరుగుతుండటం చాలా సంతోషకరమన్నారు. ఎందుకంటే నాలాంటి చాలా మంది కార్మికులు సహకార సంఘంలో చేరడానికి అసలు స్ఫూర్తి దీనదయాళ్‌ అంత్యోదయ విధానం అన్నారు. సహకార సంఘాలు లేకుండా పేదల సంక్షేమం ఊహించలేము. స్వాతంత్య్రం పొందిన 75 ఏళ్ల తర్వాత.. సహకార ఉద్యమం (ఞనీనూ।సజీబితిల। పనీల।ప।నిబి) అత్యంత అవశ్యకతగా ఉన్న సమయంలో దేశ ప్రధాని మోదీ సహకార మంత్రిత్వ శాఖను తీసుకొచ్చారు. ఆయన మన అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలుపు తున్నాను’అని చెప్పారు. సహకార సంఘాలు దేశ అభివృద్దిలో ముఖ్యమైన సహకారం అందించ గలవని అమిత్‌ షా అన్నారు. దేశాభివృద్దిలో సహకార సంఘాల పాత్ర ఉందని చెప్పారు. కొత్తగా ఆలోచించాలని.. పని పరిధిని విస్తరించి.. పారదర్శకతను తీసుకురావాలని ఆయన కోరారు. ప్రతి గ్రామానికి సహకార రంగాన్ని తీసుకెళ్లాలి. ప్రతి గ్రామాన్ని సహకారం నుంచి శ్రేయస్సు అనే మంత్రంతో సంపన్నం చేయడం ద్వారా దేశాన్ని సుభిక్షంగా మార్చడమే ఈ శాఖ పాత్ర అని చెప్పారు. 5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి సహకార రంగం కూడా కృషి చేస్తుందని ప్రధాని మోదీకి హావిూ ఇస్తున్నట్టుగా చెప్పారు.

Other News

Comments are closed.