కరీంనగర్

వేములవాడలో పోటెత్తిన భక్తులు

రాజన్న సిరిసిల్లా మహాశివరాత్రి జాతర సమీపిస్తుండటంతో పాటు సోమవారం కలిసిరావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో వస్తున్న భక్తులు..స్వామివారిని దర్శించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్లా జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి భక్తులు పోటెత్తారు.  ధర్మగుండంలో పవిత్రస్నానమాచరించి తడిగుడ్డలతో కోడెమొక్కులను చెల్లించుకుంటున్నారు. భక్తుల రద్దీ కారణంగా రాజన్న దర్శనానికి ఆరుగంటల సమయం పడుతోంది. మరోవైపు భక్తుల … వివరాలు

రాజన్న జాతర షురూ.. పోటెత్తిన భక్తులు

వేములవాడ: కరీంనగర్‌ జిల్లా వేములవాడలో కొలువుదీరిన రాజన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతోంది. ఈ రోజు నుంచి శివరాత్రి జాతర ప్రారంభం అయినట్లు ఆలయ అధికారులు తెలిపారు. రద్దీ దృష్ట్యా భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు.

సుల్తానాబాద్‌లో కార్డన్‌సెర్చ్

సుల్తానాబాద్(పెద్దపల్లి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో పోలీసులు కార్డన్ సెర్చ్ చేపట్టారు. శుక్రవారం వేకువజామున జరిపిన తనిఖీల్లో 60 మంది పోలీసులు పాల్గొన్నారు. మార్కండేయకాలనీదిగ్బంధం చేసి, ఇంటింటినీ సోదా చేశారు. ఎలాంటి పత్రాలు లేని 20 బైక్‌లు, ఒక ఆటోను సీజ్ చేశారు. వంద లీటర్ల గుడుంబాను ధ్వంసం చేశారు. ఆరుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని … వివరాలు

జమ్మికుంటలో నిర్బంధ తనిఖీలు

కరీంనగర్: జమ్మికుంటలో పోలీసులు ఈ తెల్లవారుజాము నుంచి నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సీపీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 8 బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా సుల్తానాబాద్ మార్కండేయ కాలనీలో చేపట్టిన నిర్బంధ తనిఖీల్లో 25 మంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 25 … వివరాలు

పెళ్లిపీటలు ఎక్కుతుండగా హత్య

కరీంనగర్ లో పెళ్లి చేసుకోవడానికి గుడికి వచ్చిన ప్రేమికులపై యువతి కుటుంబ సభ్యులు, బంధువులు దాడి చేశారు. ఈ దాడిలో యువకుడు మృతిచెందాడు. అతని తండ్రి గాయపడ్డాడు. జిల్లాలోని తిమ్మాపూర్ మండలం ఎల్ఎండీ కాలనీలో ఈ దారుణం జరిగింది. మృతుడు కరీంనగర్ లోని విజయపురి వాసి మహంకాళి అనిల్ గా గుర్తించారు. ఈ జంట శ్రీలక్ష్మీ … వివరాలు

చెన్నమనేని లలిత మృతికి సీఎం కేసీఆర్ సంతాపం

తెలంగాణ సాయుధ పోరాట యోధుడు, మాజీ ఎమ్మెల్యే దివంగత చెన్నమనేని రాజేశ్వరరావు భార్య, వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ తల్లి లలిత కన్నుమూశారు. ఆమె భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శన కోసం హైదరాబాద్ బంజారాహిల్స్ ఎమ్మెల్యే కాలనీలోని వారి నివాసంలో ఉంచారు. చెన్నమనేని లలిత మృతికి సీఎం కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు … వివరాలు

గోదావరిఖ సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు వచ్చేనా..?

గోదావరిఖని(కరీంనగర్) : సింగరేణిలో వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరించాలని కార్మిక సంఘాలు చేస్తున్న డిమాండ్ నెరవేరే పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఆరవ ధపా గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చినట్లేనని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో వారసత్వ ఉద్యోగా ల ప్రకటన చేసే అవకాశం ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఈ విషయంలో … వివరాలు

కరీంనగర్‌ జిల్లాలో రైతుల ఆందోళన

కరీంనగర్‌: జిల్లాలోని రాయ్‌కల్ మండలంలో రైతులు ఆందోళన బాట పట్టారు. మండలంలోని అల్లీపూర్‌లో విద్యుత్‌ అధికారులు అటోమెటిక్‌ స్టార్టర్లు తొలగిస్తున్నారని రైతులు ఆందోళనా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రధాన రహదారిపై బైటాయించారు. దీంతో ట్రాఫిక్‌కు కొంత అంతరాయం ఏర్పడింది.

ఏసీబీ వలలో అవినీతి వీఆర్వో

కరీంనగర్ జిల్లాలో ఓ అవినీతి అధికారి ఏసీబీ వలలో చిక్కాడు. పెద్దపల్లి మండలం రంగాపూర్ వీఆర్ వో గౌస్ పాషా… శ్రీనివాస్ అనే రైతు నుంచి లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. శ్రీనివాస్ కు చెందిన వ్యవసాయ భూమి రిజిస్ట్రేషన్ కోసం గౌస్ 40 వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు. దీంతో, శ్రీనివాస్ ఏసీబీ … వివరాలు

టిప్పర్‌ ఢీకొని బాలుడి మృతి

సుల్తాన్‌పూర్‌తండా (మఠంపల్లి): టిప్పర్‌ ఢీకొని బాలుడు మృతిచెందాడు. ఈ ఘటన మండలంలోని సుల్తాన్‌పూర్‌తండాలో గురువారం చోటు చేసుకుంది. సుల్తాన్‌పూర్‌తండా పునరావాస కాలనీకి చెందిన భూక్యారెడ్య, బూలిల కుమారుడు భూక్యా విష్ణువర్థన్‌ (6) పెదవీడు విద్యాన్‌ పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నాడు.రోజూ పాఠశాలకు చెందిన బస్సే విద్యార్థులను తీసుకెళ్లి మళ్లీ విడిచిపెడుతుంది. ఈ క్రమంలో ఉదయం విష్ణువర్ధన్‌ … వివరాలు