వార్తలు

మద్యం మత్తులో నాలుగో అంతస్తు నుంచి..

హైదరాబాద్‌: మద్యం మత్తులో ఓ యువకుడు ఇంటి పైనుంచి పడిన ఘటన సైదాబాద్‌లో చోటు చేసుకుంది. సైదాబాద్‌లో గౌతమ్‌ అనే యువకుడు మద్యం మత్తులో నాలుగో అంతస్తు నుంచి కిందపడ్డాడు. ఈ ఘటనలో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

లారీ, ఆటో ఢీ.. ఇద్దరు మృతి

వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  చేవెళ్ల మండలం ముడిమాలగేట్‌ దగ్గర లారీ,ఆటో ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు మృతిచెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. క్షతగాత్రులను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృగాడికి బుద్ధిచెప్పిన యువతి..!

తిరువనంతపురం: తనను అత్యాచారం చేసేందుకు యత్నించిన వ్యక్తిని ధైర్యంగా ఎదుర్కొన్న యువతి అతడి మర్మాంగాన్ని కోసేసింది. ఈ ఘటన కేరళలోని కోళ్లామ్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. ఆ వివారాలిలా ఉన్నాయి.. కోళ్లామ్‌లోని పద్మనలో 23 ఏళ్ల యువతి తన తల్లిదండ్రులతో కలిసి గణేషానంద తీర్థపద స్వామి(54) అలియాస్ హరి ఆశ్రమంలో ఉంటోంది. యువతి తల్లిదండ్రులు ఆ … వివరాలు

సంఘ్‌పరివార్‌ కుట్రల్ని తిప్పికొడతాం

  – లాలూప్రసాద్‌యాదవ్‌ పాట్నా,మే 19(జనంసాక్షి): బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ పై రాష్ట్రీయ జనతాదళ్‌ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రలను తిప్పికొడతామని ఆయన హెచ్చరించారు. శుక్రవారం విూడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపడితే కేంద్రంలోని ఎన్డీఏ సర్కారును ఐదేళ్ల పాటు కొనసాగనీయకుండా గద్దె దించుతామని … వివరాలు

ప్రధానితో సచిన్‌ భేటీ

న్యూఢిల్లీ,మే 19(జనంసాక్షి): క్రికెట్‌ దిగ్గజం, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్‌ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీని కలుసుకున్నారు. వచ్చే వారం తన జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘సచిన్‌-ఎ బిలియన్‌ డ్రీమ్స్‌’ సినిమా వివరాలను ఈ సందర్భంగా ప్రధానికి వివరించారు. ఈ నెల 26న విడుదల కానున్న ఈ సినిమాలో సచిన్‌ తన పాత్రలో తానే … వివరాలు

మిశ్రాపై క్రిమినల్‌, పరవునష్టం కేసులు

న్యూఢిల్లీ,మే 19(జనంసాక్షి): మాజీ మంత్రి, ఆమ్‌ ఆద్మీ పార్టీ బహిష్కృత నేత కపిల్‌ మిశ్రాపై దిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్‌ క్రిమినల్‌ పరువు నష్టం దావా వేశారు. మిశ్రాతో పాటు భాజపా-ఎస్‌ఏడీ ఎమ్మెల్యే మన్‌జిందర్‌ ఎస్‌ సిశ్రాపై దిల్లీలోని తీన్‌ హజారీ కోర్టులో జైన్‌ పరువు నష్టం పిటిషన్‌ను దాఖలు చేశారు. ‘దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ … వివరాలు

తెలంగాణ పోలీసు మహాద్భుతం

– ఎస్సైనుంచి డీజీపీ స్థాయి అధికారులతో సీఎం సమీక్ష – వృత్తినైపుణ్యాన్ని పెంచుకోవాలి – గ్రేటెస్ట్‌ పోలీస్‌ ఆఫ్‌ ఇండియా అని ప్రశంసలు హైదరాబాద్‌,మే 19(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర సాధనలోనూ,ప్రత్యేతక తెలంగాణలో శాంతిభద్రతలను కాపాడడంలోనూ పోలీసుల సహకారం ఎంతో ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. తెలంగాణలో పోలీసుల పనితీరు అద్భుతంగా ఉందని సర్వత్రా ప్రశంసలు ఉన్నాయని … వివరాలు

యుద్ధానికి సిద్ధంకండి

– అభిమానులకు రజనీకాంత్‌ పిలుపు చెన్నై,మే 19(జనంసాక్షి):తమిళ రాజకీయాల్లో సంచలనం కలగబోతుందా? రజనీ రాజకయీఆల్లోకి రాబోతున్నాడా? అంటే అవునని ఆయనే పరోక్షంగా అంగీకరించారు. రాజకీయాల్లోకి రావాలన్న రజనీకాంత్‌ ఆంతరంగం బయటపడింది. ఇందుకు ఆయన స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. ప్రస్తుతం రాజకీయ వ్యవస్థ అధ్వాన్నంగా తయారైంది. రాజకీయ వ్యవస్థలో మార్పు రావాల్సి ఉంది. యుద్దానికి సిద్దంగా ఉండండి … వివరాలు

విద్య,వైద్య సేవలకు జీఎస్టీ మినహాయింపు

శ్రీనగర్‌,మే 19(జనంసాక్షి): కీలక రంగాలైన విద్య, ఆరోగ్య సేవలకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించింది. శ్రీనగర్‌ లో శుక్రవారం జరిగిన రెండో రోజు సమావేశంలో కౌన్సిల్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సేవల పన్నులపై రెండో రోజు సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్‌ లో చర్చించింది. సేవల్లో నాలుగు రకాల పన్ను రేట్లు … వివరాలు

భార్య వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య

న్యూఢిల్లీ : ఎన్నో నెలలు జాప్యం అనంతరం ఈ-వాలెట్ దిగ్గజం పేటీఎం, పేమెంట్స్ బ్యాంకు ఆపరేషన్లను ప్రారంభించేందుకు సిద్దమైంది. మే 23 నుంచి పేటీఎం పేమెంట్స్ బ్యాంకు ఆపరేషన్స్ ప్రారంభమవుతాయని ప్రకటించింది. ఈ  కార్యకలాపాలు సాగించేందుకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా నుంచి తుది అనుమతులు లభించినట్టు పేటీఎం తెలిపింది. ”పేటీఎం పేమెంట్స్ బ్యాంకు లిమిటెడ్(పీపీబీఎల్) … వివరాలు