వార్తలు

రైతు ప్రభుత్వం అయితే బంద్‌కు ఎందుకు మద్దతివ్వరు

టిఆర్‌ఎస్‌ తీరుపై మండిపడ్డ సిపిఎం నేత తమ్మినేని హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్‌ భారత్‌ బంద్‌కు ఎందుకు మద్దతు ఇవ్వడం లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రశ్నించారు. ప్రజలను ఇబ్బంది పెట్టడం బంద్‌ ఉద్దేశం కాదన్నారు. వ్వయసాయ చట్టాలతో కార్పోరేట్‌ కొమ్ముకాసే విధానాలను మాత్రమే తాము వ్యతిరేకిస్తున్నామని … వివరాలు

బస్సులను అడ్డుకున్న విద్యార్థులు

హనుమకొండ,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : దేశ వ్యాప్తంగా భారత్‌ బంద్‌ సందర్బంగా వరంగల్‌ పట్టణంలో షాపులను మూసేసారు. లెఫ్ట్‌ పార్టీలు ఉదయం నుంచే ర్యాలీలతో బంద్‌కు మద్దతును కోరారు. దీనిలో భాగంగా హనుమకొండ బస్టాండ్‌ దగ్గర వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసనకు దిగాయి. బస్సులు బయటకు రాకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు, పోలీసులకు మధ్య … వివరాలు

ఇద్దరిని బలి తీసుకున్న విద్యుత్‌ తీగలు

మహబూబాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : విద్యుత్‌ వైర్లు ఇద్దరి మరణానికి కారణమయ్యాయి. మహబూబాబాద్‌ జిల్లాలోని గూడూరు మండలం బొదుగొండకు చెందిన గుగులోత్‌ భూలి పొలంలో కూలి పనికి వెళ్లింది. ఈ క్రమంలో పంట చేనుకు పెట్టిన విద్యుత్‌ తీగలు తగలడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహించిన భూలి కుమారుడు పొలం యజమాని అయిన ఈర్యపై … వివరాలు

విద్యావంతులను స్ట్రీట్‌ వెండర్లుగా మార్చిన కెసిఆర్‌

నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రభుత్వం సోషల్‌ విూడియా వేదికగా మండిపడ్డ రాములమ్మ హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : ఆ బంధు.. ఈ బంధు అంటూ ఎన్నికలప్పుడు హడావుడి చేసే సీఎం కేసీఆర్‌ విద్యావంతుల పాలిట రాబందు అని బీజేపీ నాయకురాలు విజయశాంతి పేర్కొన్నారు. దాదాపు 60 వేలకు పైగా విద్యావంతులైన యువతరం ఉద్యోగాల్లేక స్ట్రీట్‌ వెండర్లుగా మారారని … వివరాలు

ధర్మపథం కార్యక్రమానికి సిఎం జగన్‌ శ్రీకారం

అమరావతి,సెప్టెంబర్‌27(జనంసాక్షి)  : దుర్గగుడిలో ధర్మపథం కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం వర్చువల్‌గా ప్రారంభించారు. ధర్మ ప్రచారం కోసమే ప్రత్యేకంగా ధర్మపథం కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం మొదలుపెట్టింది. సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధర్మపథం ముఖ్య ఉద్దేశ్యం. ఈ కార్యక్రమంలో దేవాదయశాఖమంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

యుద్దప్రాతిపదికన గులాబ్‌ సహాయక చర్యలు

మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా తుపాను ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో సిఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ అమరావతి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : యుద్ధప్రాతిపదికన గులాబ్‌ తుపాను సహాయక చర్యలను చేపట్టాలని ఎపి సిఎం జగన్‌ ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున తక్షణ సాయాన్ని వెంటనే ఇవ్వాలని, బాధిత ప్రాంతాల్లో మానవతా దృక్పథంతో ఉదారంగా వ్యవహరించాలని … వివరాలు

గుంటూరు జడ్పీ ఎస్పీ కాదంటూ పిటిషన్‌

అమరావతి,సెప్టెంబర్‌27 (జనంసాక్షి)  : ఇటీవల ఎన్నికైన గుంటూరు జడ్పీ చైర్మన్‌ క్రిస్టినా ఎస్సీ కాదంటూ ఎపి హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. క్రిస్టినా తప్పుడు ధృవ పత్రం సమర్పించారని తెనాలికి చెందిన సరళకుమారి అనే మహిళ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ విషయంపై గతంలో జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. దీంతో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు … వివరాలు

పెట్రో ధరలపై కాంగ్రెస్‌ వినూత్న నిరసన

గుర్రపు బగ్గీపై అసెంబ్లీకి ఎమ్మెల్యేలు అడ్డుకుని అరెస్ట్‌ చేసిన పోలీసులు కేంద్ర,రాష్ట్రప్రభుత్వ విధానాలపై మండిపడ్డ భట్టి,సీతక్క హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి) : పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలతో పాటు నూతన వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తూ తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గుర్రపు బండి విూద అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. దీంతో కాంగ్రెస్‌ నేతలను గుర్రపు … వివరాలు

ఎంపిటిసి,జడ్పీటిసిలకు జెండా ఎగురవేసే అవకాశం

మండలిలో ప్రతిపాదించిన ఎమ్మెల్సీ కవిత హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): కేంద్రం 15 ఫైనాన్స్‌ కమిషన్‌లో స్థానిక సంస్థలకు రూ. 500 కోట్లు లోటు పెట్టినా.. మండల ప్రజాపరిషత్‌లు, జిల్లా ప్రజాపరిషత్‌లు సభ్యుల గౌరవాన్ని కాపాడేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ అదనంగా రూ. 500 కోట్లు కేటాయించారని ఎమ్మెల్సీ కవిత అన్నారు. శాసన మండలిలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత తొలిసారిగా … వివరాలు

రాష్ట్రంలో మూడు జనపనార మిల్లుల ఏర్పాటు

ఒప్పందం చేసుకున్నట్లు వెల్లడిరచిన మంత్రి కెటిఆర్‌ గోనె సంచుల కొరత తీర్చేందుకే అని వెల్లడి అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వివరణ హైదరాబాద్‌,సెప్టెంబర్‌27 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రంలో జనపనార మిల్లును ఏర్పాటు చేసేందుకు మూడు కంపెనీలతో ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ తెలియచేశారు. జనపనార పరిశ్రమను ఏర్పాటు … వివరాలు