హైదరాబాద్

వ్యవసాయరంగంలో కొత్త ఒరవడులకు ప్రోత్సాహం: పోచారం

హైదరాబాద్: రాజేంద్రనగర్ నార్మ్ ప్రాంగణంలో వ్యవసాయ నైపుణ్యాలపై దక్షిణాది రాష్ర్టాల సదస్సు జరుగుతోంది. ముఖ్య అతిథిగా వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరయ్యారు. కేంద్ర వ్యవసాయ శాఖ అదనపు కార్యదర్శ రాఘవేంద్రసింగ్, మేనేజ్ డీజీ ఉషారాణి సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పోచారం మాట్లాడుతూ… వ్యవసాయరంగం బలోపేతం దృష్ట్యా కొత్త ఒరవడులకు ప్రోత్సాహం అందిస్తామని … వివరాలు

తిరుపతిలో కేసీఆర్‌కు భారీగా స్వాగత ఏర్పాట్లు

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు స్వాగతం పలుకుతూ తిరుపతిలో భారీగా ఫ్లెక్సీలు వెలిశాయి. మంగళవారం కేసీఆర్‌ తిరుమలకు వెళ్లనున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో రేణిగుంట విమానాశ్రయం నుంచి కరకంబాడి మార్గంలో తిరుపతి వరకు కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ రోడ్డు పక్కన భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు … వివరాలు

మార్చి8న బడ్జెట్ సమావేశాలు

  అసెంబ్లీ సమావేశాలపై జరుగుతున్న కసరత్తు ఓ కొలిక్కి వచ్చింది. మార్చి 8 నుంచి బడ్జెట్‌‌ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2017-2018 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్‌ను మార్చి 11న ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు. కనీసం 18 రోజులపాటు సమావేశాలను నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ప్రణాళిక, ప్రణాళికేతర పద్దులు లేకుండా కొత్త తరహాలో రూపు … వివరాలు

ఓల్డ్ సిటీలో విషాదం

గుర్రం.. స్కూటీ ఢీ:వ్యక్తి మృతి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో విషాదం నెలకొంది. రోడ్డుపై వెళ్తున్న గుర్రాన్ని స్కూటీ ఢీ కొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. మైలార్ దేవ్ పల్లిలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గుర్రాన్ని ఢీ కొట్టడంతో స్కూటీ పై వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు కిందపడ్డారు. బెదిరిన గుర్రం.. కిందపడిన హమీద్ తలపై కాలుతో తొక్కడంతో … వివరాలు

నయీమ్‌తో పోలీసుల విందుపై స్పందించాలి

రాష్ట్ర హోం మంత్రి, డీజీపీలకు సీపీఐ నేత నారాయణ లేఖ హైదరాబాద్‌: గ్యాంగ్‌స్టర్‌ నయీమ్‌తో సన్నిహితంగా మెలిగిన పోలీసుల వివరాలు బహిర్గతం చేయాలని సీపీఐ నేత నారాయణ డిమాండ్‌ చేశారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్‌శర్మకు ఆదివారం ఆయన లేఖ రాశారు. నయీమ్‌ ఉదంతాలపై సీబీఐ విచారణ చేయించాలని తాను కోర్టులో పిల్‌ వేస్తే…ప్రభుత్వం … వివరాలు

ఢిల్లీ పర్యటనకు సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఆదివారం రాత్రి 9.00 గంటలకు శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి విమానంలో బయల్దేరారు. సోమవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం హాజరుకానున్నారు. రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీని కలసి ఉస్మానియా యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించనున్నారు. అలాగే ఈ పర్యటనలో పలువురు కేంద్ర … వివరాలు

అనుమానాస్పద స్థితిలోబాలుడు మృతి

హైదరాబాద్ : నగరంలోని కూకట్‌పల్లి వేంకటేశ్వర నగర్‌లో ఓ బాలుడు అనుమానాస్పద స్థితిలో చనిపోయి కనిపించాడు. బాలుడు రక్తపుమడుగులో పడి ఉండడంతో పోలీసులు వివిధ కోణాల్లో ఆరా తీస్తున్నారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బాలుడిని బంబరాయితో మోది హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వేరో … వివరాలు

ఏప్రిల్‌ 24 నుంచి వేసవి సెలవులు

హైదరాబాద్‌: తెలంగాణలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల ముసాయిదా విద్యాసంవత్సర ప్రణాళిక (అకడమిక్‌ కేలండర్‌)ను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. 2017-18 విద్యాసంవత్సరాన్ని మార్చి 21 నుంచి ప్రారంభించి, ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 11 వరకు వేసవి సెలవులు ఇవ్వాలని నిర్ణయించింది. ఈమేరకు నూతన విద్యాసంవత్సర ముసాయిదా కేలండర్‌ను ఉపాధ్యాయ సంఘాలకు పంపించింది. ఈ … వివరాలు

స్వచ్ఛ స్ఫూర్తి నింపిన క్రికెట్ మ్యాచ్ లు

హైదరాబాద్‌ ఎల్ బి స్టేడియంలో స్వచ్ఛ క్రికెట్ మ్యాచ్ లు ఉత్సాహపూరితంగా జరిగాయి. జిహెచ్ఎంసీ కార్పోరేటర్లు, సినిమా తారల మధ్య జరిగిన రెండు టి20 మ్యాచ్ లో సినీ తారల జట్లే విజయం సాధించాయి. ఉదయం జరిగిన మ్యాచ్ లో మహిళా కార్పొరేటర్ల టీమ్‌ పై సినీ నటీమణుల జట్టు గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన … వివరాలు

ఫార్మాసిటీతో ఉపాధి

హైదరాబాద్‌: ఫార్మాసిటీతో మూడు లక్షల మందికి ఉపాధి ప్రత్యక్షంగా , పరోక్షంగా లభిస్తుందని మంత్రి కెటిఆర్‌ తెలిపారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.. ఫార్మాసిటీని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు.