అంగన్వాడీలో చిన్నారులకు స్వీట్ల పంపిణీ

కమాన్ పూర్, జనం సాక్షి : కమాన్ పూర్ మండలం గుండారం గ్రామంలో అంగన్వాడి సెంటర్లో సాజన్ పుట్టినరోజు సందర్భంగా చిన్నారులకు స్వీట్లను పంపిణీ చేశారు. సీనియర్ పాత్రికేయుడు జబ్బార్ ఖాన్ మనుమడు మూడవ పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడి సెంటర్ లో కేక్ కట్ చేసి చిన్నారులకు పంపిణీ చేశారు. ఈ వేడుకల్లో అంగన్వాడి కార్యకర్తలు విజయలక్ష్మి శివనాగాంజలి తోపాటు మెహవీన్ హైమన్ తదితరులు పాల్గొన్నారు.