అండర్‌-19 ప్రపంచకకవ్‌ విజేత భారత్‌

టౌన్స్‌విలే: అండర్‌-19 ప్రపంచ కవ్‌ను భారత్‌ సొంతం చేసుకొంది. ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై 6 వికెట్ల తేడాతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఉమ్మక్తచంద్‌ సెంచరీ (111), స్మీత్‌పటేల్‌ అర్థశతకం (62)తో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. 47.4 ఓవర్లలోనే భారత్‌ 227 పరుగులు చేసి విజయ లక్ష్యాన్ని చేరుకోంది. అపర్‌జిత్‌ 33, విహారీ 4 పరుగులు చేశారు. ఆసీస్‌ బౌలర్లలో పరీస్‌, స్టేకెటీ, సందూ, టర్నర్‌ తవో వికెట్‌ తీశారు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది.2002లో కైఫ్‌ కెప్టెన్సీలో ఒక సారి, 2008లో కోహ్లీ సారథ్యంలో రెండోసారి, ఇప్పుడు ఉస్ముక్త్‌ చంద్‌ కెప్టెన్సీలో ట్రోఫీని స్వతం చేసుకుంది.