అంబర్‌పేటలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌పై దాడి
హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలోని శివంరోడ్డులో తనిఖీలు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై దాడి జరిగింది. చలనా కట్టుమన్నందుకు రోజూ తనిఖిలతో ఇబ్బందులకే గురిచేస్తారా అంటూ ముగ్గురు వాహనదారులు కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ దాడికి పాల్పడిన వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.