అక్రమ వలసదారుల్లో గుబులు

` వారిపై ఉక్కుపాదం మోపుతున్న ట్రంప్‌
` తనిఖీల్లో గురుద్వారాలను సైతం వదలని అమెరికా అధ్యక్షుడు
` తొలుత వ్యతిరేకించినా.. మోకరిల్లిన కొలంబియా
న్యూయార్క్‌(జనంసాక్షి):చెప్పినట్టుగానే అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో ఆయన అనుసరిస్తోన్న విధానాలపై తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. అక్రమ వలసదారుల్ని గుర్తించే క్రమంలో గురుద్వారాలనూ వదలడం లేదు. హెమ్‌ల్యాండ్‌ సెక్యూరిటీకి చెందిన అధికారులు న్యూయార్క్‌, న్యూజెర్సీల్లోని ఈ ప్రార్ధనా మందిరాల్లోనూ తనిఖీలు చేయడంపై సిక్కు సంస్థలు మండిపడుతున్నాయి. గురుద్వారాల పవిత్రతకు ఈ చర్య ముప్పుగా పరిణమించిందని ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. వేర్పాటువాదులు, అధికారిక పత్రాలు లేని వలసదారులు వీటిని ఉపయోగించుకోవచ్చంటూ అమెరికా స్థానిక విూడియాలో కథనాలు వెలువడ్డాయి. ’’ట్రంప్‌ యంత్రాంగం ఇప్పటివరకూ వందలమంది అక్రమ వలసదారులను అరెస్టు చేసింది. వీరంతా ఉగ్రవాదం, మాదకద్రవ్యాల రవాణా, లైంగిక నేరాలు వంటి కేసుల్లో నిందితులుగా ఉన్నవారే. ఇక, అమెరికా చరిత్రలోనే అతిపెద్ద బహిష్కరణ ఆపరేషన్‌ కొనసాగుతోంది. సైనిక విమానాల్లో వందల మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించేశాం. ఎన్నికల్లో ట్రంప్‌ తాను ఇచ్చిన హావిూని నెరవేరుస్తున్నారు’’ అని ఇదివరకు వైట్‌హౌస్‌ వెల్లడిరచింది. మరోవైపు, అక్రమ వలసలకు తాము వ్యతిరేకమని, ఎందుకంటే అది పలురకాల వ్యవస్థీకృత నేరాలతో ముడిపడి ఉందని ఇప్పటికే భారత్‌ స్పష్టం చేసింది. అయితే, వీసా గడువు ముగిసినా లేదా సరైన దస్త్రాలు లేకుండా భారతీయులు అమెరికా/ప్రపంచంలో ఎక్కడ ఉన్నా వారిని తిరిగి తీసుకువచ్చే వీలు కల్పిస్తామని భారత విదేశాంగశాఖ స్పష్టం చేసింది. సంబంధిత డాక్యుమెంట్లను తమతో పంచుకుంటే వాటిని పరిశీలించి స్వదేశానికి తీసుకువస్తామని పేర్కొంది.అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులపై అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కఠినంగా వ్యవహరిస్తూ..ప్రత్యేక విమానాల్లో వారిని స్వదేశాలకు పంపించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అమెరికా సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి అధ్యక్షుడు ట్రంప్‌ తీవ్రంగా శ్రమిస్తున్నారు. యూఎస్‌లో చట్టవిరుద్ధంగా ఆశ్రయం పొందుతున్న తమ పౌరులను వెనక్కి పిలుపించుకోవడానికి ప్రపంచ దేశాలు తగిన చర్యలు తీసుకొని మాకు సహకరించాలి‘ అని వైట్‌హౌస్‌ పేర్కొంది. అయితే ఈ చర్యలను ముందుగా వ్యతిరేకించిన కొలంబియా అనంతరం వెనక్కి తగ్గి అగ్రరాజ్యం పెట్టిన నిబంధనలకు అంగీకరించిందని వైట్‌హౌస్‌ పేర్కొంది. కొలంబియా వెనక్కి తగ్గి స్వదేశానికి తిరిగి వచ్చిన పౌరులను ఆహ్వానించడంతో తాము ఆ దేశంపై విధించిన సుంకాలు, పలు ఆంక్షలను నిలిపివేయనున్నట్లు అమెరికా ప్రకటించింది. ‘అమెరికాలో ఉన్న అక్రమ వలసదారులను ప్రత్యేక విమానాల్లో వారివారి స్వదేశాలకు పంపడానికి అగ్రరాజ్యం అనుసరిస్తున్న తీరుపై పలు దేశాల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇలా వలసదారులను తీసుకొచ్చే విమానాలను తమ దేశంలోకి అనుమతించమని కొలంబియా తేల్చి చెప్పింది. ‘కొలంబియా వలసదారులను తీసుకువచ్చే అమెరికా విమానాలను దేశంలోకి ప్రవేశించకుండా నిషేధిస్తున్నా’ అని ఆ దేశాధ్యక్షుడు గుస్తావో పెట్రో ఇటీవల పేర్కొన్నారు. వలసదారులను గౌరవంగా పంపించేందుకు అమెరికా నిబంధనలు రూపొందిస్తేనే వాటిని అనుమతిస్తామన్నారు. ఇప్పటికే అమెరికా సైనిక విమానాలను వెనక్కి పంపించినట్లు చెప్పారు. వలసదారులను నేరస్థులుగా చిత్రీకరించకుండా, అమెరికా పౌర విమానాల్లో పంపిస్తేనే వాటిని తమ దేశంలోకి అనుమతిస్తామని పెట్రో పేర్కొన్నారు.దీనిపై ట్రంప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. కొలంబియా ఉత్పత్తులపై సుంకాలు 50 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. కొలంబియన్‌ ప్రభుత్వ అధికారుల వీసాలను వెంటనే రద్దు చేస్తానని అన్నారు. ఈ చర్యలు ఆరంభం మాత్రమే అని.. తమ నిబంధనలను పాటించి ప్రపంచ దేశాలు తమ పౌరులను తిరిగి వెనక్కి ఆహ్వానించకపోతే వారిపై మరిన్ని సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. మరోవైపు అమెరికా అనుసరిస్తున్న విధానంపై బ్రెజిల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఇలా వలసదారుల చేతులకు సంకెళ్లు వేసి పంపించడాన్ని తీవ్రంగా పరిగణించింది.

ట్రంప్‌కు మోదీ ఫోన్‌కాల్‌
` ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చ
న్యూఢల్లీి(జనంసాక్షి):అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్‌ కాల్‌లో మాట్లాడారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు వెల్లడిరచాయి. ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరునేతల మధ్య ఇదే తొలి ఫోన్‌ సంభాషణ. ట్రంప్‌` మోదీ ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించినట్లు తెలుస్తోంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ విజయం సాధించిన సందర్భంగా గతంలో ఆయనకు ప్రధాని మోదీ ఫోన్‌ కాల్‌లో అభినందనలు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి ఇద్దరు నేతలు మాట్లాడుకున్నారు.ఇదిలా ఉండగా అధ్యక్ష పదవి చేపట్టిన కొన్ని గంటల్లోని డొనాల్డ్‌ ట్రంప్‌.. కీలక పత్రాలపై సంతకాలు చేసిన సంగతి తెలిసిందే.వీటిలో అమెరికాలో జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేస్తూ సంబంధిత పత్రాలపై సంతకాలు చేశారు. ‘‘అక్రమ వలసదారులకు అమెరికాలో పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్‌ ప్రభుత్వం గుర్తించదు’’ అని ట్రంప్‌ స్పష్టం చేశారు. దీంతో అక్కడ నివసిస్తున్న భారతీయులకు జన్మించే సంతానంపై దీని ప్రభావం ఉంటుందని నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అయితే.. న్యాయపరమైన వలసలకే తాము పూర్తి మద్దతు ఇస్తామని ఇటీవల భారత విదేశాంగ మంత్రిత్వశాఖ వెల్లడిరచింది. సరైన పత్రాలు లేకుండా వలస వెళ్లే భారతీయులను చట్టబద్ధంగా తిరిగి స్వదేశానికి రప్పించేందుకు భారత్‌ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొంది. మరోవైపు, వీసా తీసుకునేందుకు 400 రోజులు ఎదురుచూడటం అనేది కీలకమైనదే. ఇది ఇరు దేశాల సంబంధాలపై ప్రభావం చూపడంతో పాటు.. వీసా ఆలస్యాల వల్ల వాణిజ్యం, పర్యటక రంగం, ద్వైపాక్షిక ప్రయోజనాలూ దెబ్బతింటాయని విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌ ఇటీవల పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఇరుదేశాధినేతలు మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది.