అగ్ని -1 ప్రయోగం విజయవంతం
బాలాసోర్, జూలై 13 (జనంసాక్షి) : భారత్ శుక్రవారం ఖండాంతర క్షిపణి అగ్ని-1ను విజయంతంగా పరీక్షించింది. దీని లక్ష్య దూరం 700 కిలోమీటర్లు. ఇది అణు ఆయుధాలు మోసుకుపోగలదు. ఒరిస్సా, వీలర్ ఐలండ్ నుంచి ఆర్మీ కోసం ఈ ప్రయోగం జరిగింది. దీన్ని ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించవచ్చు ఘన ఇంధనంతో నడుస్తుంది. ఒక కదిలే వాహనం నుంచి ఉదయం 10.10 గంటలకు ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి దీన్న ప్రయోగించారు. అధునాతన మిసైల్ ప్రయోగం విజయవంతమైందని ఒక సైంటిస్టు చెప్పారు. భారత సైన్యం కీలక కమండ్ కోసం దీన్ని ప్రయోగించినట్టు ఆయన తెలిపారు. సైన్యానికి దీన్ని ఎలా ప్రయోగించాలో తెలియజేయటమే ప్రస్తుత ప్రయోగ లక్ష్యమని తెలిపారు. ఇది ఒక రకమైన ప్రాక్టీస్ డ్రిల్ అన్నారు. భారత రక్షణ, పరిశోధనా సంస్థ (డీఆర్‌డీఓ) ఇందులో కీలక పాత్ర వహించింది. ఈ క్షీపణి గమనాన్ని అధునాతన రాడార్లు, ఎలక్ట్రో టెలిమెట్రీ స్టేషన్లు పర్యవేక్షించాయి. హైదరాబాద్‌లోని భారత్ డైనమిక్స్ డీఆర్‌డీఓ దీన్ని సంయుక్తంగా తయారు చేశాయి.