అన్ని వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం

share on facebook
* స్త్రీ,శిశు,గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
మహబూబాబాద్ బ్యూరో డిసెంబర్19 (జనంసాక్షి):
అన్ని వర్గాల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వం ధ్యేయమని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ తెలిపారు. బుధవారం
మహబూబాబాద్ జిల్లాలో క్రిస్మస్ పండుగ సందర్భంగా  మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో క్రిస్టియన్ సోదర, సోదరీమణులకు ఏర్పాటుచేసిన
 దుస్తులు, బహుమతుల పంపిణీ ఈ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని దుస్తులను , బహుమతులను పంపిణీ చేసి, క్క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలోజడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోతు బిందు, కలెక్టర్ శ్రీ శివలింగయ్య, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్, జాయింట్ కలెక్టర్ డేవిడ్, ఆర్ డి ఓ కొమురయ్య, జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి శ్రీనివాస రావు, స్థానిక నేతలు, అధికారులు, క్రిస్టియన్ మత పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
రాష్ట్రంలో అందరూ సంతోషంగా ఉండాలని సీఎం కేసీఆర్ గారు ఆలోచించి  అన్ని వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతున్నదని చెప్పారు.ఆర్థిక మాంద్యం ఉన్నా మొదలు పెట్టిన సంప్రదాయాన్ని కొనసాగించాలని బతుకమ్మ చీరలు, రంజాన్ చీరలు, క్రిస్మస్ దుస్తులు  అందిస్తున్నట్లు తెలిపారు.మహబూబాబాద్ జిల్లా గతంలో నిర్లక్ష్యానికి గురైన జిల్లా. సరైన అభివృద్ధి జరగలేదని సీఎం కేసీఆర్ గారు స్వయంగా జిల్లాను ఏర్పాటు చేయడంతోపాటు   అనేక వరాలు కురిపించాలని అన్నారు .కలిసినప్పుడల్లా సీఎం కేసీఆర్ గారు ఈ జిల్లా అభివృద్ధి గురించి అడుగుతుంటారని,. ఈ జిల్లా సమగ్ర అభివృద్ధికి మనసు పెట్టి పని చేస్తున్నామని చెప్పారు..
ఇప్పటికే ఈ పనిలో భాగంగా మేము కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నామని, మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయని త్వరలో మహబూబాబాద్ రూపురేఖలు  మారబోతున్నాయని అన్నారు. ఎమ్మెల్యే కూడా ఎప్పటికప్పుడు సూచనలు అందిస్తున్నారని, సమష్టిగా మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు.సౌత్ ఇండియాలొనే పెద్ద బిషప్ చర్చి డోర్నకల్లో ఉన్నదని,  ఇక్కడ ఇంకా క్రిస్టియన్లు అభివృద్ధి జరగాలని అన్నారూ.మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా ఈ ప్రాంతంలో సీఎం కేసీఆర్ గారు విద్యకు పెద్ద పీట వేస్తూ అనేక గురుకులాలు ఇచ్చారని, అవి సరిగా నడిచే విధంగా పర్యవేక్షించే వలసిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
బిడ్డ పుట్టక ముందే తల్లీ, బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని  దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వారి కోసం పోషకాహారాన్ని అంగన్వాడీ ల ద్వారా అందిస్తున్నామని తెలిపారు.నీతి ఆయోగ్ కూడా ఇక్కడ సీఎం కేసీఆర్ గారి ఆధ్వర్యంలో మహిళా, శిశువుల కోసం జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలను కొనియాడారని చెప్పారు.భవనాలు, రోడ్లకు డబ్బులు ఇవ్వకున్నా సంక్షేమానికి ఒక్క రూపాయి తగ్గించకుండా పెద్దపీట వేశారన్నారు.మనమంతా ఇక్కడ ఒక టీం గా పనిచేసి అభివృద్ధి కోసం పాటుపడుదా మని పిలుపునిచ్చారు.
అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్న సీఎం కేసీఆర్ గారికి మరింత శక్తి ఇవ్వాలని అందరూ ప్రార్థించాలని మంత్రి ఉఈ సందర్భంగా కోరారు.
జిల్లా కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య మాట్లాడుతూ క్రిస్మస్ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి ప్రతి సంవత్సరం క్రిస్టియన్ సోదరులకు దుస్తులు పంపిణీ, విందు ఏర్పాటు జరుగుతుందన్నారు.: అన్ని వర్గాల వారు సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో దసరా, రంజాన్, క్రిస్మస్ ఆనందంగా లక్ష్యంతో అందిస్తుందన్నారు. పేదవారికి పండుగ జరుపుకోవడానికి దుస్తులను కానుకగా, విందు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. జిల్లాలోని అండ్ నియోజకవర్గాలకు నియోజకవర్గానికి వెయ్యి చొప్పున దుస్తులను కానుకగా అందిస్తున్నట్లు తెలిపారు. అందరూ బాగుండాలని అందులో మనం ఉండాలని ప్రభుత్వం చేయూత అందిస్తుందన్నారు.
స్థానిక శాసనసభ్యులు శంకర్ నాయక్ మాట్లాడుతూ క్రిస్మస్ పండుగను పేద క్రిస్మస్ సోదరులు ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం క్రిస్మస్ గిఫ్ట్ లను, విందు ను ఏర్పాటు చేస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం దినదిన అభివృద్ధి చెందుతుందని, మానుకోట జిల్లా రంగాలు సమగ్ర అభివృద్ధి జరగాలని ప్రార్థనలు చేయాలని క్రైస్తవ సోదరులను కోరారు. పేదవారికి సహాయం చేస్తే దేవునికి నైవేద్యం పెట్టి నట్లు అని చెప్పారు. గిరిజన జిల్లా అయిన మహబూబాబాద్ లో అన్ని ఖనిజ సంపదలు ఉన్నాయని, అందరి సహాయ సహకారాలతో జిల్లాను అభివృద్ధి పథంలో నడుపుతామని ఈ సందర్భంగా ఆయన కోరారు.అనంతరం మంత్రి, కలెక్టర్, జెడ్పి చైర్ పర్సన్, ఎమ్మెల్యే లు  కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ వెల్ఫేర్ జిల్లా అధికారి కే.శ్రీనివాసరావు, జెసి డేవిడ్, కురవీ జడ్పిటిసి బండి వెంకటరెడ్డి, మహబూబాబాద్ జడ్పిటిసి ప్రియాంక, ఎంపీపీ మౌనిక, టిఆర్ఎస్ సీనియర్ నాయకుడు శ్రీకాంత్ నాయక్ తదితరులు పాల్గొన్నారు

Other News

Comments are closed.