అప్పుల బాధ భరించ లేక వ్యక్తి ఆత్మహత్య.

 

 

 

 

 

 

 

 

 

జనంసాక్షి /పాపన్నపేట మార్చి 12 అప్పుల బాధ భరించ లేక ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లిలో శనివారం రాత్రి చోటుచేసుకుంది పాపన్నపేట ఎస్సై విజయ్ కుమార్ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి… నాగసాన్పల్లి గ్రామానికి చెందిన బ్యాగరి ప్రభాకర్ 42 కూలి పనులు చేసుకుంటూ కుటుంబంతో సహా సొంత గ్రామంలో జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక పరిస్థితి బాగాలేక మెదక్ పట్టణానికి చెందిన పెద్ద లక్ష్మి, చిన్న లక్ష్మి వద్ద పదివేల రూపాయలు గతంలో అప్పు తీసుకున్నాడు. అవి ఇప్పుడు మిత్తి తో సహా 85000 అయ్యాయి. వీటితోపాటు గజ్వేల్ కు చెందిన పూజ వద్ద 40000 రూపాయలు అక్టోబర్ 22న అప్పు తీసుకువచ్చాడు. అవి కూడా తీర్చకపోవడంతో పూజ ఇటీవల ప్రభాకర్ ను గజ్వేల్ కు తీసుకెళ్లి నాలుగు రోజులపాటు పని చేయించుకుని వదిలిపెట్టారు , అప్పు ఎలా తీర్చాలో తెలియక ప్రభాకర్ మదన పడసాగాడు. దీంతో ప్రభాకర్ భార్య మన్నెమ్మ ఈనెల 9వ తేదీన డబ్బులు తీసుకురావడానికి అని అతని మరిది రాజు వద్దకు వెళ్ళింది. మానసికంగా కృంగిపోయిన ప్రభాకర్ ఈనెల 11న శనివారం రాత్రి ఇంట్లో ఫ్యాన్ కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రభాకర్ కుమారుడు విజయ్ తల్లి కి ఫోన్ చేసి చెప్పాడు. ఈ విషయమై భార్య మణెమ్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పాపన్నపేట ఎస్సై విజయకుమార్ తెలిపారు