అఫ్ఘాన్‌లో ముగ్గురు నాటో సైనికులు మృతి

కాబూల్‌: పోలీసు దుస్తుల్లో వచ్చిన ఓ వ్యక్తి దక్షిణ ఆఫ్ఘనిస్తాన్‌లో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నాటో దళాలకు చెందిన ముగ్గురు మృతి చెందారు. ఆఫ్ఘన్‌ జాతీయ సివిల్‌ పోలీసు దుస్తుల్లో ఓ దుండగుడు వచ్చి కాల్పులకు పాల్పడినట్లు అధికారులు తెలియజేశారు. దీంతో ఈ సంవత్సరంలో ఇప్పటివరకూ వివిధ ఘటనల్లో మృతి చెందిన విదేశీ సైనికుల సంఖ్య 218కు చేరింది.