అసోం పంచాయతీ ఎన్నికల్లో హింస…19కి చేరిన మృతుల సంఖ్య

గౌహతి : అసోంలోని గౌల్‌పూర్‌ జిల్లాలో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హింస కొనసాగుతోంది. ఎన్నికలకు వ్యతిరేకంగా ఆందోళనకారులు దాడులకు దిగడంతో పోలీసులు మరోసారి కాల్పుల్లు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. దీంతో నిన్నటి నుంచి జరుగుతున్న అల్లర్లలో మృతి చెందిన వారి సంఖ్య 19కి చేరింది. పోలీసు కాల్పుల్లోనే 13 మంది మృతి చెందగా.. అల్లర్లలో ఆరుగురు చనిపోయారు. స్థానిక రాభా హజోంగ్‌ స్వయం ప్రతిపత్తి జిల్లా మండలి ఎన్నికలను వ్యతిరేకిస్తూ దాడులకు దిగడంతో పోలీసులు కాల్పులు చోటుచేసుకున్నాయి. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించినట్లు అసోం హోంశాఖ కార్యదర్శి జ్ఞానేంద్రత్రిపాఠి తెలియజేశారు.

తాజావార్తలు