ఆజాద్‌ వ్యాఖ్యలను ఖండిస్తున్నం: కోదండరాం

హైదరాబాద్‌: తెలంగాణపై ఏకాభిప్రాయం కావాలన్న కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్‌ వ్యాఖ్యాలను ఖండిస్తున్నామని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్‌ కోదండరాం అన్నారు. తెలంగాణపై  ఏకాభిప్రాయం కావాలని కేంద్రం అనడం రాజ్యాంగ విరుద్దమని ఆయన విమర్శించారు. గతంలో ఏర్పడిన మూడు రాష్ట్రాలు సంక్లిష్ట పరిస్థితుల్లో ఏర్పడినవేనని కోదండరాం గుర్తు చేశారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను కేంద్రం విస్మరిస్తుందని , రాజ్యాంగానికి తూట్లు పొడిచే విధంగా వ్యవహరిస్తుందని దుయ్యబట్టారు.