ఆటోను ఢీ కొన్న లారీ…ముగ్గురు మృతి

అనంతపురం: అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. గుట్టూర్‌ జంక్షన్‌ వద్ద ఆటోను లారీ ఢీ కొనడంతో సంఘటనస్థలంలోనే ముగ్గురు మృతి చెందగా తీవ్ర గాయాలైన మరో ముగ్గురిని పెనుకొండ ఆసుపత్రికి తరలించారు.