ఆమరణ నిరాహార దీక్షకైనా సిద్ధం: మధుయాష్కి
హైదరాబాద్: ఫీజు రియంబర్స్‌మెంట్ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై కాంగ్రెస్ ఎంపీ మధు యాష్కీ మండి పడ్డారు. నాలుగైదు రోజుల్లో ఫీజు రియింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం దిగిరాక పోతే ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధమని ఆయన చేప్పారు. ఎస్సీ, ఎస్టీలకు ఫీజు రియింబర్స్‌మెంట్ ఉన్నట్లే బీసీలకు కూడా 27శాతం కేటాయించాలని పార్లమెంట్‌లో కోరుతామని తెలిపారు.