ఆమె మెదడుకి కూడా గాయమైంది : వైద్యులు

సింగపూర్‌ : ఢిల్లీ ఘటన బాధితురాలి మెదడుకు కూడా గాయం ఉన్నట్లు సింగపూర్‌ వైద్యులు తెలిపారు. వూపిరితిత్తుల్లో, పొట్టలో ఇన్‌ఫెక్షన్‌ వ్యాపించిందని తీవ్ర విషమ పరిస్థితులతో ఆమె పోరాడుతోందని శుక్రవారం ఉదయం వైద్యులు ప్రకటించారు. వివిధ విభాగాల్లో నిపుణులు, అనుభవజ్ఞులు అయిన వైద్య బృందం ఆమె పరిస్థితిని నిరంతరం అంచనా వేస్తున్నారని ఆస్పత్రి యాజమాన్యం పేర్కొంది.