ఆరవ కార్యాలయం ప్రారంభించిన గూగీ ప్రాపర్టీస్
ఖైరతాబాద్ : సెప్టెంబర్ 01 (జనం సాక్షి) అతి తక్కువ కాలంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న రియల్ ఎస్టేట్ సంస్థ గూగీ ప్రాపర్టీస్ తన ఐదో వార్షికోత్సవం సందర్భంగా గురువారం హైదరాబాద్ లో ఆరవ కార్యాలయాన్ని టోలిచౌకి వద్ద ప్రారంభించింది. ఘనంగా జరిగిన కార్యక్రమంలో, గూగీ ప్రాపర్టీస్ ఎండీ షేక్ అక్బర్ సమక్షంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసరథి ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మోహిఉద్దిన్, నానల్ నగర్ కార్పొరేటర్ మొహమ్మద్ నసీరుద్దీన్ పాల్గొన్నారు. గూగీ సంస్థ డైరెక్టర్లు, సిబ్బంది, అసోసియేట్ లు, కస్టమర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు. గూగీ ప్రాపర్టీస్ ఇప్పటి వరకు వరంగల్ హైవే, సాగర్ హైవే, విజయవాడ హైవే, శ్రీశైలం హైవే మరియు బెంగళూరు హైవే లలో ప్రాజెక్టులను పూర్తి చేసింది. త్వరలో మిగితా హైవేలలో గూగీ ప్రాజెక్టులు అందుబాటులోకి రానున్నాయని తెలిపింది.