ఆర్థిక సహాయం అందజేసిన పెరిక సంఘం మండల అధ్యక్షుడు గడ్డం రామచందర్
దండేపల్లి జనంసాక్షి మార్చి 20 దండేపల్లి మండలం పాత మామిడిపల్లి గ్రామానికి చెందిన గుడి కందుల అనిల్ కుమార్ ఇటీవల జగిత్యాల జిల్లా రాజరాంపల్లి రోడ్డుపై వెళ్తుండగా బైకు ఢీకొట్టడంతో మృతి చెందాడు మృతుని కుటుంబ సభ్యులు నిరుపేదలు కావడంతో దీనస్థితిలో ఉన్నారని తెలుసుకొని ఆయన మేనమామ కుదురుపాక గంగన్నకు సోమవారం జై జవాన్ జై కిసాన్ అడ్మిన్ పెరక సంఘం మండల అధ్యక్షుడు గడ్డం రామచందర్ స్థానిక ఎంపీపీ కార్యాలయంలో 6000 రూపాయలను నగదును ఆర్థిక సహాయం అందజేశారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ గడ్డం శ్రీనివాస్ వైసీపీ పసర్తి అనిల్ మాజీ వైస్ ఎంపీపీ ఆకుల రాజేందర్ కాంగ్రెస్ నాయకులు పోలిశెట్టి సత్తన్న( బద్రి) ఎంపిటిసి ముత్తే రాజన్న తదితరులు పాల్గొన్నారు