ఆలయ వివాదంపై సీఎం సమగ్ర విచారణ జరిపిస్తానన్నారు: దానం

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని లక్ష్మీనరసింహ స్వామి ఆయల వివాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పినట్లు కార్మికశాఖ మంత్రి దానం నాగేందర్‌ అన్నారు. తన విషయంలో సీఎం సానుకూలంగా స్పందించారని, హరేకృష్ణకు కేటాయించి భూములను రద్దు చేయాలని కోరానని ఆయన అన్నారు. దేవాలయం దగ్గరకు వెళ్లినందుకు తాను చింతిస్తున్నాని… అయితే స్థానికుల కోసమే శాసనభ్యుడిగా వెళ్లాల్సి  వచ్చిందని దానం తెలిపారు. ముఖ్యమంత్రికి తనకు ఎలాంటి విభేదాలు లేవని స్పష్టం చేశారు.