ఇంగ్లండ్‌కు 207 పరుగుల ఆధిక్యం

కోల్‌కతా : భారత్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌ 523 పరుగులకు ఆలౌట్‌  అయింది. దీంతో ఇంగ్లండ్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 207 పరుగుల ఆధిక్యం లభించింది. ఆరు వికెట్ల నష్టానికి 509 పరుగుల ఓవర్‌నైట్‌స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్‌ మరో 14 పరుగులను జోడించి ఆలౌట్‌ అయింది భారత్‌ బౌలర్లలో ఓజా 4, అశ్విస్‌ 3 వికెట్లు తీయగా జహీర్‌ఖాన్‌, ఇషాంత్‌ శర్మ చెరో వికెట్‌ తీశారు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 316 పరుగులకు ఆలౌట్‌ అయింది.