ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి – కొడంగల్ నియోజకవర్గ శాసనసభ్యులు

 

 

 

 

 

 

 

 

పట్నం నరేందర్ రెడ్డి గారు…తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి జరగబోయే ఇంటర్ పరీక్షలకు కొడంగల్ నియోజక వర్గం నుండి పరీక్షల హాజరవుతున్న విద్యార్థినీ విద్యార్థులకు కొడంగల్ నియోజకవర్గ శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు ఆల్ ది బెస్ట్ తెలియజేశారు… ఇంటర్మీడియట్ పరీక్షలకి సకాలంలో హాజరై మేధస్సుతో పరీక్షలను రాసి తల్లిదండ్రులకు, కొడంగల్ నియోజకవర్గానికి మంచి గుర్తింపు తీసుకురావడంతో పాటు తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని ఇంటర్మీడియట్ విద్యార్థిని విద్యార్థులను గౌరవ శాసన సభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారు కోరారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్మీడియట్ పరీక్షల కొరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిందని, హాజరయ్యే విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు ఎదురవకుండా అన్ని రకాల చర్యలు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారు ఈ సందర్భంగా తెలియజేశారు

మీ
పట్నం నరేందర్ రెడ్డి
కొడంగల్ నియోజకవర్గ శాసన సభ్యులు