ఇటలీ రాయబారి దేశం విడిచి వెళ్లరాదు : సుప్రీంకోర్టు

ఢిల్లీ : తదుపరి ఆదేశాలు జారీ చేసేవరకు ఇటలీ రాయబారి దేశం విడిచి వెళ్లరాదని సుప్రీంకోర్టు ఆదేశించింది. వియన్నా ఒప్పందం ప్రకారం తనకు మినహాయింపు ఇవ్వాలని సుప్రీంను ఇటలీ రాయబారి దేశం విడిచి వెళ్ల కుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇటలీ రాయబరి నమ్మకం కోల్పోయారని, ఆయన మాటలను విశ్వసించబోమని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. ఇటలీ నావికుల ఉదంతంపై విచారణను ఏప్రిల్‌ 2 వరకు న్యాయస్థానం వాయిదా వేసింది.