ఈకో -ఫ్రెండ్లీ గణపతి కి లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట ద్వారా గుర్తింపు సర్టిఫికెట్ అందచేసిన

ఎల్బీ నగర్ (జనం సాక్షి ) గత 34 సంవత్సరాలుగా శ్రీ గణేష్ యువ భక్త మండలి స్థాపించిన పీ &టీ కాలనీ లో ప్రతి సారి అత్యంత భక్తి శ్రద్ధలతో మండపము వద్ద పూజలు నిర్వహిస్తున్న కమిటి ని గుర్తించి లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ జిల్లా 320-D స్థానిక లయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ కొత్తపేట ద్వారా గుర్తింపు సర్టిఫికెట్ అందచేశారు .ప్రపంచ పర్యావరణాన్ని కాపాడే దిశా లో పీ ఎన్  టీ కాలనీ లో  34 అడుగుల ఈకో -ఫ్రెండ్లీ గణపతి విగ్రహాన్ని గత నాలుగు సంవత్సరాలు నుండి పూజలు చేస్తూ ఈ సంవత్సరం కూడా నిమజ్జనం అక్కడే నిర్వహిస్తున్న కమిటీ ని గుర్తించి ప్రపంచములో అతిపెద్ద NGO సంస్థ ద్వారా లయన్ కొట్టం జంగయ్య యాదవ్ జోన్ ఛైర్పర్సన్ మరియు లయన్ డాక్టర్ బి విజయ్ రంగ జిల్లా చైర్మన్ హెల్త్ కేర్  ద్వారా మండపము వద్ద కమిటీ ముఖ్య సభ్యులు శ్రీ బీ నారాయణ రావు,కర్ణ శ్రీనివాస్ రావు , రాంకుమార్ రాజు ,పీ నాగేస్వరావు పీ చంద్ర శేఖర్ యాదవ్ ,ఆర్ శ్రీనివాస్ రెడ్డి పీ రాజేష్ యాదవ్ ,బి శ్రీనివాస్ యాదవ్,పీ జ్ఞానేంద్ ర్ రావు గార్లకి అందచేసి వారిని అభినందించారు .