ఈనెల 4 నుంచి సీపీఐ రాష్ట్ర మహాసభలు..
– సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్
చేర్యాల (జనంసాక్షి) సెప్టెంబర్ 01 : భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు ఈ నెల 4 నుంచి 7 వరకు రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో జరిగే సభలను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు అందె అశోక్ పిలుపునిచ్చారు. గురువారం చేర్యాల పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో వాల్ పోస్టర్లను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 4న శంషాబాద్లో వేలాది మంది పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించి జడ్పీ హైస్కూల్ మైదానంలో భారీ బహిరంగసభ అనంతరం 7వ తేదీ వరకు మహాసభలు జరుగుతాయన్నారు. ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శులు డాక్టర్ కె. నారాయణ, అతుల్ కుమార్ అంజన్, ఎంపీ. బినయ్ విశ్వం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీ అజీజ్ పాషా, రాష్ట్ర సహాయ కార్యదర్శులు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకట్ రెడ్డి హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ మహాసభల్లో పార్టీ సంస్థాగత నిర్మాణం, భవిషత్తు కార్యాచరణ, మతోన్మాద శక్తుల ఆగడాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా చర్చించి భవిష్యత్ పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ మహాసభలకు కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు ఈరి భూమయ్య, మండల సహాయ కార్యదర్శి పొన్నబోయిన మహేందర్, డివిజన్ నాయకులు వలబోజు నర్సింహా చారి, గూడెపు సుదర్శన్, ఆత్మకూరి హరిక్రిష్ణ, గజ్జల సురేందర్, కొల్పుల కిష్టయ్య, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.