ఈరోజు మ‌ధ్యాహ్నం తెలంగాణ భ‌వ‌న్‌కు సీఎం కేసీఆర్

హైద‌రాబాద్ : ఈరోజు మ‌ధ్యాహ్నం ముఖ్య‌మంత్రి కేసీఆర్ తెలంగాణ భ‌వ‌న్‌ కు రానున్నారు. మ‌హారాష్ట్ర కు చెందిన రైతు సంఘం కీల‌క నేత శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ . సీఎం కేసీఆర్ స‌మక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేర‌నున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌హారాష్ట్ర‌కు చెందిన ప‌లువురు నేత‌లు, ఆయ‌న మ‌ద్ద‌తుదారులు హైద‌రాబాద్ కు చేరుకున్నారు. భారీ కాన్వాయ్‌తో శ‌ర‌ద్ జోషి ప్ర‌ణీత్ తెలంగాణ భ‌వ‌న్‌కు చేరుకోనున్నారు. కంధార్ లోహా లో బీఆర్ఎస్బ‌హిరంగ స‌భ విజ‌య‌వంతం కావ‌డంతో.. పార్టీలోకి చేరిక‌లు ఊపందుకున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే సీఎం కేసీఆర్ స‌మ‌క్షంలో ఎన్సీపీ నేత అభ‌య్ కైలాస్ రావ్ చిక్ట‌గోంక‌ర్పార్టీలో చేరారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో అభ‌య్ కైలాస్‌కు గులాబీ కండువా క‌ప్పి పార్టీలోకి సాద‌రంగా ఆహ్వానించారు