ఈరోజు సాయంత్రం నిర్వహించనున్న విలాస్‌రావు అంత్యక్రియలు

లాటూర్‌: నిన్న కన్నుమూసిన కేంద్ర మంత్రి విలాస్‌రావు దేశ్‌ముఖ్‌ అంత్యక్రియలు ఈరోజు సాయంత్రం నిర్వహించనున్నారు. ఆయన పార్థివశరీరాన్ని ప్రత్యేక విమానంలో ఈరోజు ఉదయం ఆయన స్వస్థలం లాటూర్‌కు తీసుకువచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలవరకు అభిమానుల సంధర్శనార్థం స్థానిక దయానంద్‌ పాఠశాలలో ఉంచారు. అనంతరం దేశ్‌ముఖ్‌ స్వగ్రామం బాభల్‌గామ్‌ తీసుకెళ్లి అక్కడ వారి పూర్వీకుల ఇంట్లో కాసేపు ఉంచుతారు.