ఈ నెల 22న ప్రారంభం కానున్నా హిందీ మహాసభలు

వాషింగ్టన్‌: తొమ్మిదో ప్రపంచ హిందీ మహాసభలు దక్షిణాఫ్రికాలోని జొహనెనస్‌బర్గ్‌లో ఈనెల 22న ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ వరకు ఈ మహాసభలు జరుగుతాయి. ఈ వేడుకల్లో భారత్‌ నుంచి 120 మంది హిందీ పండితులు పాల్గొంటుండగా అందులో 20 మంది రాష్ట్రానికి చెందనవారు. ఈ సందర్భంగా 20 మంది ప్రముఖ హిందీ పండితులను సత్కరించనున్నారు. 2007లో ఈ మహాసభలను న్యూయార్క్‌లో నిర్వహించారు.