ఉత్తమ ఉపాధ్యాయునికి అత్యుత్తమ పురస్కారం
దంతాలపల్లి సెప్టెంబర్ 5 జనం సాక్షి
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు ఎండి యాకూబ్ అలీ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కావడంతో ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,జిల్లా కలెక్టర్ శశాంక, మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ ల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారని పాఠశాల ప్రధానోపాధ్యాయులు బుదారపు శ్రీనివాస్ తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ బృందం ఉత్తమ ఉపాధ్యాయుడిని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి అబ్దుల్ హై ,జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అంగోత్ బిందు, అడిషనల్ కలెక్టర్ అభిలాష అభినవ్,మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.