ఉత్తర గ్రిడ్‌లో 40శాతం విద్యుత్ సరఫరా చేస్తాం: సుశిల్‌కుమార్ షిండే
ఢిల్లీ: ఉత్తర భారతదేశంలోని ఏడు రాష్ట్రాలకు విద్యుత్ సరఫరా స్తంబించడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్న నేపథ్యంలో విద్యుత్ శాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే వివరణ ఇచ్చారు. అధికలోడు కారనంగానే ఉత్తరగ్రిడ్‌లో సాంకేతికలోపం తలెత్తిందని అన్నారు. ఉత్తర గ్రిడ్‌లో 40శాతం విద్యుత్ సరఫరాను పునరుద్దరించామని అయితే దీన్ని కేవలం అత్యవసర సర్వీసులకు సరఫరా చేస్తామని, ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఉత్తర గ్రిడ్ పరిధిలోని మిగితా ప్రాంతాలకు విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల నుంచి విద్యుత్‌ను తీసుకుంటున్నామని అన్నారు.