ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలి

సంగారెడ్డి, జూలై 29 : తెలంగాణ పంచాయితీరాజ్‌ నాల్గవ తరగతి పార్ట్‌టైం, ఎం,ఆర్‌సి మెసెంజర్స్‌ ఉద్యోగాలను పర్మినెంట్‌ చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింలు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఆదివారంనాడు జిల్లా ప్రజా పరిషత్‌ అభివృద్ధి కార్యాలయం ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జీవో ఎంఎస్‌ 112 ప్రకారం పిటిఎస్‌లను రెగ్యూలరైజ్డ్‌ చేయాలని, బ్యాక్‌లాగ్‌ పోస్టులలో ఎంఆర్‌సిలచే భర్తీ చేయాలని కోరారు. విధి నిర్వహణలో మరణించిన పిటిఎస్‌ స్థానంలో వారి కుటుంబ సభ్యులలో ఒక్కరికి ఉద్యోగావకాశం కల్పించాలన్నారు. తెలంగాణ పంచాయతీ రాజ్‌ నాల్గవ తరగతి పార్ట్‌టైం, ఎం,ఆర్‌సి మెసెంటర్స్‌ ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సలీం, ఉపాధ్యక్షులు మధుసూదన్‌, సహాయ కార్యదర్శులు కె.రమేష్‌, శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.