ఉన్నత పాఠశాలలో ఉత్తమ ఫలితాలు

నర్సంపేట, మే 25(జనంసాక్షి) : నర్సంపేట మండలంలోని ఇటుకాలపెల్లి గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు ఎస్సెసి వార్షీక ఫలితాలలో ఉత్తమ ఫలితాలు సాధించారు. గంజి క్రాంతికుమార్‌ ఎ1 (9.3/10), పిట్టల మౌనిక ఎ1(9.2/10), ముత్తోజు జ్యోత్స్నఎ1(9.2/10), అందెకల్పన ఎ2 (9.2/10) వీరితో పాటు ఎ2(9.2/10)లో మరో పది మంది విద్యార్థులు సాధించారు.ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఉపాధ్యక్షుడు కె.నగేష్‌, జేఎసి మండల కన్వీనర్‌ చంద్రమౌళి, ఎస్‌ఎంసి సభ్యులు శ్రీనివాస్‌, రమేష్‌, కొమ్మాలు, భ్రహ్మచారిు అభినందించారు.