ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోల మృతి

రాంచీ,ఫిబ్రవరి24(జ‌నంసాక్షి):ఝార్ఖండ్‌ రాష్ట్రంలోని గుమ్లా ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరిగింది. అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ చేపట్టిన భద్రతా బలగాల సిబ్బందికి మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. భద్రతా బలగాల కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఘటనాస్థలిలో రెండు ఏకే 47 తుపాకులను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.