ఎఫ్‌డీఐలతో ఉపాధి కోల్పోతాం : అరుణ్‌జెట్లీ
న్యూఢిల్లీ: ఎఫ్‌డీఐలను దేశంలోకి అనుమతిస్తే మన లక్షల ఉద్యోగాలు కోల్పోతాం దీంతో లక్షల మంది నిరుద్యోగులుగా రోడ్లపై పడతారు’ అని బీజేపీ రాజ్యసభ సభ్యుడు అరుణ్‌జెట్లీ అన్నారు. ఇవాళ ఆయన రాజ్యసభలో ఎఫ్‌డీఐలపై జరిగిన చర్చ సందర్భంగా మాట్లాడారు. ఎఫ్‌డీఐలను ప్రభుత్వం అనుమతించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈ నిర్ణయంతో దేశీయ ఉత్పాదన రంగంలో లక్షలాది మందికి నష్టం జరుగుతుందని జెట్లీ ఆవేదనతో అన్నారు.