ఎఫ్‌డీఐలుపై దీది ఫైర్‌

న్యూఢిల్లీ: చిల్లర వర్తకం, బీమా, విమానయానం వంటి కీలక రంగాల్లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) అనుమతించడాన్ని యూపీఏ కీలక భాగస్వామి తృణమూల్‌ కాంగ్రెస్‌ మరోమారు తీవ్రంగా వ్యతిరేకించింది. చిల్లర వర్తకం బీమా, పించన్లు వంటి రంగాల్లో ఎఫ్‌డీఐలకు మేం వ్యతిరేకం. విమానయాన రంగంలోకి కూడా, మేం సామన్య ప్రజలకు మాత్రమే అనుకూలం అని తృణముల్‌ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు మమతా బెనర్జీ అన్నారు. చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐలను అనుమతిస్తే కార్మికులు అత్మహత్యలు చేసుకునే పరిస్థితి తలెత్తుతుందని ప్రపంచ దేశాలన్నీ చెబుతున్నాయి. కీలక భాగస్వామి అయిన తృణమూల్‌ కాంగ్రెస్‌ నుంచి సరైన మద్దతు లేనందున సంస్కరణల బిల్లుల విషయంలో పార్లమెంటులో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పేలా లేవు. ప్రస్తుతం ఉన్న ఎఫ్‌డీఐల పరిధిని 26 శాతం నుంచి 49 శాతానికి పెంచుదామని ప్రతిపాదించే అవకాశముంది. పిఛను నిధి నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార బిల్లు-2011 ఆమోదానికి ప్రభుత్వం యత్నించవచ్చు. ఈ బిల్లు వల్ల పిఛను రంగంలో ప్రైవేటు, విదేశీ పెట్టుబడులకు అవకాశం చిక్కుతుంది. దీంతోపాటు దేశీయ విమానయాన సంస్థల్లో వాటా కొనుగోలుకు విదేశీ విమానయాన సంస్థలకు అవకాశం కల్పించాలని కూడా ప్రభుత్వం భావిస్తోంది.