ఎస్డీఎఫ్ నిధులతో అభివృద్ధి పనులు ప్రారంభం •పోల్కంపల్లి, తక్కడపల్లిలో శంకుస్థాపన చేసిన జడ్పీటీసీ, ఎంపీపీ, ప్రజాప్రతినిధులు

మునిపల్లి, జనంసాక్షి : మండలంలోని పోల్కంపల్లి, తక్కడపల్లి గ్రామాల్లోఎస్సీ కమ్యూనిటీ హాల్​, సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ పనులను గురువారం నాడు జడ్​పీటీసీ పైతర మీనాక్షి సాయికుమార్​, ఎంపీపీ శైలజ శివశంకర్​లు ప్రారంభించారు. ఈ సందర్బంగా అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సహకారంతో ఎస్​డీఎఫ్​ నిధుల నుండి మంజూరైన రూ.10లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్, రూ.10లక్షలతో సీసీ రోడ్డు, సీసీ డ్రైన్ పనులు మంజూరు కావడంతో పనులను ప్రారంభించినట్లు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ దేశ్ కి నేత ముఖ్యమంత్రి కెసిఆర్ కృషితో అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ నియోజకవర్గానికి భారీగా నిధులు మంజూరు చేయిస్తున్నారన్నారు. అందుకు మండలంలోని ప్రతి గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని వారన్నారు. గతంలో జరిగనటువంటి అభివృద్ధి ప్రస్తుతం మునిపల్లి మండలంలో శరవేగంగా జరుగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్​ఎస్​ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, ఎంపీటీసీ మంద రాజశేఖర్, మాజీ ఎంపీపీ చంద్రయ్య, నాయకులు అల్లాపురం నారాయణ, తక్కడపల్లి చంద్రయ్య, పోల్కంపల్లి సర్పంచ్ నాగమణి, గ్రామ పార్టీ అధ్యక్షుడు సంగమేశ్వర్, మాజీ సర్పంచులు వీరన్న, సంగయ్య, సంగమేశ్వర్, గురువీర్ , మాజీ గ్రామ అధ్యక్షులు వీరన్న, అశోక్, ముల్లయ్య , ఆంజనేయులు, ఆయా గ్రామ కార్యదర్శులు, వార్డు మెంబర్లు , బీఆర్​ఎస్​ నాయకులు తదితరులుపాల్గొన్నారు.