ఏఐఎస్ఫ్ నూతన రాష్ట్ర అధ్యక్షుడికి ఘన సన్మానం
జనంసాక్షి/చిగురుమామిడి – ఆగష్టు30:
తెలంగాణ రాష్ట్ర ఏఐఎస్ఫ్ నూతన అధ్యక్షుడిగా ఇటీవలే ఎన్నికైన కసిరెడ్డి మణికంఠ రెడ్డికి కరీంనగర్ జిల్లా ఉపాధ్యక్షుడు మండలంలోని రేకొండ గ్రామానికి చెందిన కొంకటి ప్రశాంత్ మంగళవారం ఘన సన్మానం చేశారు. ఈనెల 26, 27, 28 తేదీలలో తెలంగాణ రాష్ట్రం మూడవ మహాసభలు కొత్తగూడెంలో జరిగాయి. ఈమహాసభలలో కరీంనగర్ జిల్లా ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మణికంఠ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నిక కావడం పట్ల కొంకటి ప్రశాంత్ హర్షం వ్యక్తం చేశారు. తను జిల్లాలో విద్యార్థుల పట్ల అలుపెరుగని పోరాటాలు చేసి రాష్ట్రంలోనే ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు.ఈకార్యక్రమంలో బోనగిరి మహేందర్, బూడిద సదాశివ, లెనిన్, మచ్చ రమేష్, రామారావు ,వెంకటేష్ ,అమ్రిష్, రాము తదితరులు పాల్గొన్నారు.