ఏళ్ళుగా సాగుతున్న నిగిని రోడ్డు బోథ్

share on facebook

మార్చి 19(జనంసాక్షి) మండలంలోని నిగిని మర్లపల్లి బాబేర ల వైపు వెళ్లే రోడ్డు పనులు సంవత్సరాల తరబడి కొనసాగుతున్నాయి. గత నాలుగేళ్ల క్రితం మొదలుపెట్టిన రోడ్డు పనులు ఇప్పటికీ ఒక కొలిక్కి రాక ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. గతంలో ఉన్న రోడ్డును మరమ్మతుల నిమిత్తం సగం వరకు తొలగించి కంకర కుప్పలను పరిచారు. మరికొంత భాగం ఒకవైపు రోడ్డు పనులు పూరి చేశారు. ఇక బోథ్ నుండి మర్ల పెళ్లి వరకు వెళ్లే రోడ్డు చదును చేసి వదిలిపెట్టడంతో అసలే బంకమన్ను నేల కావడంతో ఆ రోడ్డుపై చినుకు పడిందంటే చిత్తడిగా మారుతుంది, ప్రధానంగా వర్షాలు పడే సమయంలో రోడ్డంతా బురదమయంగా కావడంతో కనీసం ద్విచక్ర వాహనం సైతం అటువైపు వెళ్ళలేని పరిస్థితి నెలకొంది అంతేకాకుండా వర్షం తర్వాత ఆ బురదతో ఏర్పడిన గుంతలతో వాహనదారులు నరకం చూస్తున్నారు. సంవత్సరాలుగా రోడ్డుపనులు పూర్తి కాకనప్పటికీ సంబందిత అధికారులు కానీ స్థానిక ప్రజాప్రతినిధులు పనులు సాగే దిశగా ఆలోచించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏదేమైనాప్పటికీ దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదని చందాన, ప్రభుత్వం రోడ్డు మంజూరు చేసినా స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు పట్టించుకోకపోవడంతో ఆ వైపు వెళ్లే దాదాపు 20 గ్రాముల ప్రజలకు ప్రయాణం అంటేనే నరకంగా భావించేలా పరిస్థితి మారింది. ఇకనైనా సంబంధిత శాఖ అధికారులు పట్టించుకుని పనులు సకాలంలో పూరి చేయాలని లేని పక్షంలో రాబోయే వర్షాకాలంలో అటువైపు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆవేద వ్యక్తం చేస్తున్నారు

Other News

Comments are closed.