ఐకేపీ మహిళా సంఘాల పని తీరును పరిశీలించిన కేంద్రప్లానింగ్‌ కమిషనర్‌ సలహదారు

చేగుంట: మండలంలోని కర్నాల్‌పల్లిలో ఐకేపీ మహిళ సంఘాల పనితీరును కేంద్ర ప్లానింగ్‌ కమిషన్‌ సలహదారు ఏకే జైన్‌ పరిశీలించారు. మహిళల ఆర్థిక పరిస్థితిని, పౌష్టికాహార కేంద్రాలను, సేంద్రియ వ్యవసాయం అమలు తీరును మహిళలను అడిగి తెలుసుకున్నారు. తాము ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నామని మహిళలు ఆయనకు వివరించారు.