ఐటీ అంటే.. ఇండియన్‌ టాలెంట్‌ : పొన్నాల

హైదరాబాద్‌: ప్రతక్షంగా, పరోక్షంగా ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఐటీశాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. ఐటీ అంటే ఇండియన్‌ టాలెంట్‌ అన్న మంత్రి దేశానికి ప్రతిభ కలిగిన యువత అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. అవంతి గ్రూప్‌ ఆఫ్‌ కళాశాల ఏర్పాటు చేసిన టెక్నో- ఆస్పియర్‌ -2కె 13ని మంత్రి ప్రారంభించారు. దేశీయ ఐటీ రంగంలో మన రాష్ట్రం నుంచే 1/3 ఆదాయం వస్తోందన్నారు. యువతలో ఉన్న సృజనాత్మకత పరిజ్ఞానాన్ని వెలికి తీసేందుకు  ఓ సదస్సు ఏర్పాటు చేసినట్లు అవంతి కళాశాలల ఛైర్మన్‌ శ్రీనివాసరావు తెలిపారు. ఈ సదస్సులో దాదాపు 50 కళాశాలలకు చెందిన విద్యార్థిని, విద్యార్థులు పాల్గొంటున్నారని ఆయన అన్నారు.

తాజావార్తలు